గుడ్‌న్యూస్‌: పట్టాలపైకి మరో 8 రైళ్లు

తాజా వార్తలు

Updated : 09/10/2020 00:27 IST

గుడ్‌న్యూస్‌: పట్టాలపైకి మరో 8 రైళ్లు

సికింద్రాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభణతో నిలిచిపోయిన రైలు సర్వీసులను రైల్వే శాఖ దశల వారీగా పునరుద్ధరిస్తోంది. ఇటీవల దేశ వ్యాప్తంగా 39 రైళ్లు నడిపేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి. సికింద్రాబాద్‌- విశాఖపట్నం; లింగంపల్లి- కాకినాడ పట్టణం, తిరుపతి -విశాఖపట్నం, సికింద్రాబాద్‌- షాలిమార్‌ మధ్య ఈ నెల 13 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది.

* ఈ నెల 13 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌ - షాలిమార్‌ రైలు 

* ఈ నెల 14 నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్‌ - సికింద్రాబాద్‌ రైలు  

* ఈ నెల 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతి - విశాఖ రైలు

* ఈ నెల 15 నుంచి ప్రతి గురు, శని, సోమ వారాల్లో రాత్రి 10.25గంటలకు విశాఖ - తిరుపతి రైలు 

* ఈ నెల 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌ - విశాఖ రైలు 

* ఈ నెల 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు విశాఖ- సికింద్రాబాద్‌ రైలు 

* ఈ నెల 26 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.55 గంటలకు లింగంపల్లి - కాకినాడ రైలు 

* ఈ నెల 25 నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో 8.10 గంటలకు కాకినాడ - లింగంపల్లి రైలు 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని