రఘురామ వైద్యపరీక్షలపై ఆర్మీ ఆసుపత్రి ప్రకటన
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఘురామ వైద్యపరీక్షలపై ఆర్మీ ఆసుపత్రి ప్రకటన

హైదరాబాద్‌: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షలపై సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. రఘురామకు ముగ్గురు వైద్యుల మెడికల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉండనున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. 

సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి రఘురామను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు. అనంతరం ఈ నివేదికను తెలంగాణ హైకోర్టు జనరల్‌కు సీల్డ్‌ కవర్‌లో పంపనున్నారు. వారు సుప్రీంకోర్టుకు ఈ నివేదికను చేరవేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని