సంక్రాంతి రద్దీ.. మరో రెండు ప్రత్యేక రైళ్లు

తాజా వార్తలు

Published : 13/01/2021 01:19 IST

సంక్రాంతి రద్దీ.. మరో రెండు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: సంక్రాంతి పండగకు వెళ్లే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని రెండు రైళ్లు వేసింది. ఈ నెల 17న నర్సాపూర్‌ - సికింద్రాబాద్‌ (07441); కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ (07457) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది.

17న రాత్రి రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరనున్న సంక్రాంతి ప్రత్యేక రైలు ఆ మరుసటి రోజు ఉదయం 06.05గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. పాలకొల్లు, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనుంది.

అలాగే, కాకినాడ టౌన్‌ నుంచి 17న సాయంత్రం 6గంటలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు ఆ మరుసటి రోజు ఉదయం 05.20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. ఈ రైలు సామర్లకోట, ద్వారపూడి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి..

కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని