ఎలాంటి సమన్లు అందలేదు

తాజా వార్తలు

Published : 25/08/2020 02:22 IST

ఎలాంటి సమన్లు అందలేదు

 రియా చక్రవర్తి లాయర్‌

ముంబయి: సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులకు గానీ ఎటువంటి సమన్లు అందలేదు. ఈ విషయాన్ని రియా లాయర్‌ సోమవారం పేర్కొన్నారు. ‘రియాకి గానీ ఆమె కుటుంబసభ్యులకు గానీ సీబీఐ నుంచి ఎటువంటి సమన్లు అందలేదు. సమన్లు అందితే వారు విచారణకు హాజరవుతారు’ అని లాయర్‌ సతీష్‌ మనేషిండే స్పష్టం చేశారు. జూన్‌ 14న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ముంబయి పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

తన కుమారుడిని మానసిక వేదనకు గురిచేశారని, అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని నటుడి తండ్రి కేకే సింగ్‌ జులై 28న బిహార్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు డబ్బుతో ముడిపడి ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టింది. ఆగస్టు 9, 10వ తేదీల్లో రియా చక్రవర్తిని రెండు సార్లు ప్రశ్నించింది. మరో 56 మందిని సైతం విచారించింది. కాగా, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ ఆగస్టు 19వ తేదీనీ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విచారణను ముమ్మరం చేసిన సీబీఐ సుశాంత్‌ వంట మనిషి నీరజ్‌ను, నటుడి మిత్రుడు సిద్ధార్థ్‌ పటానీని విచారించింది. సుశాంత్‌ ఫ్లాట్‌కి వెళ్లి అతడు మరణించిన రోజు ఘటనను రీక్రియేట్‌ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని