TS News: ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 02/06/2021 12:18 IST

TS News: ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు సీఎం వెళ్లి నివాళులర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్‌ ఉండాలని.. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చే జాతీయ లక్ష్యాన్ని తెలంగాణ సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఘ‌న‌మైన చ‌రిత్ర‌, విశిష్ట సంస్కృతుల‌కు తెలంగాణ నిల‌య‌మని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం స‌హ‌జ వ‌న‌రులు, నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌నరులను క‌లిగి ఉంద‌ని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి, స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. దేశంలో త‌న వంతు పాత్రను రాష్ట్రం కొన‌సాగించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు వెంకయ్య పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్న‌ట్లు ప్రధాని మోదీ చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం కొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల కృషితో క‌రోనా నుంచి త్వ‌ర‌లో బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.

శాస‌న‌స‌భ‌, మండ‌లిలో వేడుక‌లు..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా అసెంబ్లీలో స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాసరెడ్డి, శాన‌మండ‌లిలో ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. తెరాస రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ నేత కేశ‌వ‌రావు, నాయ‌కుల‌తో క‌లిసి మువ్వ‌న్నెల జెండాను ఎగుర‌వేశారు. 

వేడుకల్లో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, గంగుల

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానికంగా ఉన్న అమరవీరుల స్తూపాల వద్ద మంత్రులు నివాళులర్పించారు. ఉద్యమం నాటి నుంచి ప్ర‌జ‌ల‌ మ‌ద్ద‌తుకు రుణ‌ప‌డి ఉన్నామ‌ని కేటీఆర్‌ అన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని