TS News: ఏపీ శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలి: తెలంగాణ

తాజా వార్తలు

Published : 22/09/2021 18:54 IST

TS News: ఏపీ శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలి: తెలంగాణ

హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజలస్రవంతి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్యబోర్డును కోరింది. ఈమేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు మరో లేఖ రాశారు. ఈనెల 8న రాసిన లేఖకు కొనసాగింపుగా తాజా లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. 2021-22 నీటి సంవత్సరంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈనెల 20 వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 76.39 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 9.28 టీఎంసీల నీటిని ఏపీ తరలించినట్టు తెలిపారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి ఏపీ 85.66 టీఎంసీలు, తెలంగాణ 7.47 టీఎంసీల నీటిని తీసుకున్నట్టు వివరించారు.  1976 అంతర్‌ రాష్ట్ర ఒప్పందం, 1981  కేంద్ర జలసంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలంలో 880 అడుగులకు పైన నీరు ఉన్నప్పుడు మాత్రమే బేసిన్‌ వెలుపలకు 34 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించాలని ఈఎన్సీ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌  ఈఏడాది ఇప్పటికే  85.67 టీఎంసీల నీటిని మళ్లించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌  నుంచి ఏపీ నీరు విడుదల చేయకుండా తక్షణమే ఆపాలని కృష్ణాబోర్డును కోరారు. వాటాకు విరుద్ధంగా వరద సమయంలో ఏపీ మళ్లించిన జలాలను లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ కోటాలో మిగిలిన జలాలను ఉమ్మడి జలాశయాల్లో నిల్వ ఉండే నీటి నుంచి వచ్చే ఏడాదికి వినియోగించుకునేందుకు అనుమతించాలని ఈఎన్‌సీ కేఆర్‌ఎంబీని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని