Talasani srinivas Yadav: విజయ డెయిరీని ప్రభుత్వం బలోపేతం చేసింది: తలసాని

తాజా వార్తలు

Updated : 03/09/2021 16:22 IST

Talasani srinivas Yadav: విజయ డెయిరీని ప్రభుత్వం బలోపేతం చేసింది: తలసాని

రావిర్యాల: విజయ డెయిరీతో చిన్న, సన్నకారు రైతులకు చేయూత అందుతోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించనున్న విజయ మెగా డెయిరీ ప్రాజెక్టుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి తలసాని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..  రావిర్యాలలో మెగా డెయిరీ ఎర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. పాల సేకరణ, సాంకేతిక విభాగానికి రూ.250 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత విజయ డెయిరీపై ప్రభుత్వం దృష్టి సారించి మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ఏడేళ్ల కాలంలో రూ.300 కోట్లుగా ఉన్న వార్షిక టర్నోవర్‌ను రూ.750 కోట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం విజయ డెయిరీ నుంచి 28 రకాల ఉత్పత్తులు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో డెయిరీ ఔట్‌లెట్లు ఉన్నాయన్నారు. పాడి రైతులకు చేయూత కోసం లీటర్‌పై రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు తలసాని వెల్లడించారు. విజయ డెయిరీ 365 రోజులు పాలు సేకరిస్తోందని వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని