Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/07/2021 12:56 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రాజకీయ లబ్ధి కోసమే మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్‌: కేంద్రం

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫడవిట్‌ దాఖలు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉప సంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది.

ap news: ఏపీ పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా   

2. దేవినేనిపై హత్యయత్నం కేసు నమోదుపై చంద్రబాబు ఆగ్రహం

మాజీ మంత్రి దేవినేని ఉమపై హత్యయత్నం కేసు నమోదు చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమపై దాడికి పాల్పడిన నేతలను వదిలిపెట్టారని మండిపడ్డారు. తెదేపా నేతలపై హత్యాయత్నం కేసు పెడతారా?అని ప్రశ్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

ఆంగ్లేయులది, జగన్‌ది ఒకటే మనస్తత్వం: సోము వీర్రాజు

3. జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ అడ్డగింత.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మునుగోడులో జరుగుతున్న రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి వాహనశ్రేణిని మునుగోడు చౌరస్తాలో కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి రాకుండా అవుటర్ రింగ్‌రోడ్డు దాటిన తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని బొంగులూరు గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

4.  పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం  విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు.

5. కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణ స్వీకారం

కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై కొలువుతీరారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు

6. India corona: 43వేల కేసులు..41వేల రికవరీలు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. మంగళవారం 17,36,857 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 47 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 3.14 కోట్ల కేసులు వెలుగుచూడగా.. 4,22,022 మంది మహమ్మారికి బలయ్యారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

7. Parliament: పార్లమెంట్‌లో మళ్లీ అదే రగడ

ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం, సాగు చట్టాలపై విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం కూడా వాయిదా పర్వం మొదలైంది. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు.

8. Pegasus Row: ప్రతిపక్ష నేతలతో రాహుల్‌గాంధీ భేటీ

పార్లమెంట్‌ను కుదిపేస్తున్న పెగాసస్‌ ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు నేడు సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేశ్‌లతో పాటు శివసేన, సీపీఐ, సీపీఎం, రాష్ట్రీయ జనతాదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

9. Sumanth: హీరో సుమంత్‌ వివాహం

అక్కినేని కుటుంబంలో శుభకార్యం జరగనుంది. హీరో సుమంత్‌ వివాహం నిశ్చయమైంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమంత్‌ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారు. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 

10. సింధు ముందుకు.. తరుణ్‌ వెనక్కి..

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌-జేలో జరిగిన రెండో పోరులో ఆమె సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో కాసేపు శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి పుంజుకొని పోటీనిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని