Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 23/06/2021 20:55 IST

Top Ten News @ 9 PM

1. ఐటీ కేంద్రంగా విశాఖ: జగన్‌

యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్షించారు. పిల్లలకు అత్యున్నత నైపుణ్యాలు నేర్పించాలని ఆదేశించారు. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రమవుతుందన్నారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయాలని ఆదేశించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని విశాఖలో తీసుకురావాలని నిర్దేశించారు.

SCR: 24 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

2. పరీక్షలపై సుప్రీంలో ఏపీ అఫిడవిట్‌

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జులై చివరి వారంలో  పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

3. Covid: ప్రాణాంతక హ్యాపీ హైపోక్సియా

ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్‌ శాతం పడిపోయినా.. శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండటంలేదు. వీరిలో కొందరు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. హ్యాపీ హైపోక్సియాకు రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్‌ కలిగించే ఇన్‌ఫ్లమేషన్‌ రియాక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి.

Ap News: కొత్తగా 4,684 కొవిడ్‌ కేసులు

Ts News: 1,114 కేసులు.. 12 మరణాలు

4. Ts News: ప్రాణం పోసిన పోలీస్‌

ఉదయం లేచామా.. అందరిలాగే విధులు నిర్వర్తించామా.. తిరిగి ఇంటికి వెళ్లిపోయామా అనేలా కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌. ద్విచక్రవాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. అంబులెన్స్‌ వచ్చే వరకు వేచి చూడకుండా బాధితుడి ప్రాణాలు కాపాడాలనే తాపత్రయంతో ప్రథమ చికిత్స చేసి యువకుడికి పునర్జన్మను ప్రసాదించాడు.

5. AP NEWS: ఎన్నికల రద్దుపై ఎస్‌ఈసీ పిటిషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలు రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశముంది.

రఘురామపై అనర్హత వేటు వేయండి: వైకాపా

6. malleswari: ఒలింపిక్స్‌ క్రీడాకారుల తయారే లక్ష్యం

ఒలింపిక్స్‌ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలుగు తేజం, దిగ్గజ వెయిట్‌ లిఫ్టర్‌, ఒలింపిక్‌ విజేత కరణం మల్లీశ్వరి పేర్కొన్నారు. దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన సందర్భంగా ఈటీవీ ఆమెను సంప్రదించగా పలు విషయాలు మాట్లాడారు. వీసీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడలను ప్రోత్యహించేందుకు అనుగుణంగా చేపట్టబోయే చర్యలను వెల్లడించారు.

7. Donations: 75%+ విరాళాలు భాజపాకే..!

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 2019-20 ఏడాదికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి రూ.276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే ఒక్క  భాజపాకే 76.17 శాతం విరాళాలు రావడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రూ.58 కోట్లు (15.98శాతం) వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక వెల్లడించింది.

8. Nirav Modi: నీరవ్‌కు షాక్‌.. భారత్‌కు వెళ్లాల్సిందే!

భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలన్న యూకే కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నీరవ్‌ చేసిన లిఖిత పూర్వక అభ్యర్థనను లండన్‌ కోర్టు తిరస్కరించింది. 

9. UniVaccine: అన్ని వైరస్‌లపై..ఒకే ఆయుధం!

 కరోనా వైరస్‌ మహమ్మారి దాటికి వణికిపోతోన్న ప్రపంచ దేశాలు.. కొవిడ్‌-19ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను కనుగొన్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో సంభవించే మహమ్మారులపై మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ముందుగానే పసిగట్టి నిర్మూలించాలని కృతనిశ్చయంతో ఉన్న శాస్త్రవేత్తలు.. భవిష్యత్తులో సంభవించే మహమ్మారుల నిర్మూలన కోసం ‘యూనివర్సల్‌ కరోనావైరస్‌ వ్యాక్సిన్‌’ను రూపొందించారు. తాజాగా ఈ వ్యాక్సిన్‌ కొవిడ్‌-19పైనే కాకుండా మరిన్ని కరోనా వైరస్‌లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలడం ఊరట కలిగించే విషయం.

10. WTC Finals: న్యూజిలాండ్‌ టార్గెట్‌ 139

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (41; 88 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్లు టిమ్‌ సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39 మరోసారి మెరవడంతో భారత్‌ మోస్తరు స్కోర్‌ సాధించింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొంటే ఆ జట్టు లక్ష్యం 139 పరుగులుగా తేలింది. మరి భారత్‌ కివీస్‌ను కట్టడి చేసి డ్రా చేసుకుంటుందా లేక ఆలౌట్‌ చేసి విజయం సాధిస్తుందా చూడాలి.

WTC Finals లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని