Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 15/10/2021 09:02 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దసరా ధమాకా
పీఎల్‌-14 తుది పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం దుబాయ్‌లో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ కోసం తలపడబోతున్నాయి. బలాబలాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. తాజా ఫామ్‌ ప్రకారం కోల్‌కతాది కాస్త పైచేయే. అయితే ధోని నాయకత్వంలోని చెన్నై ఎప్పుడైనా ఫలితాలను మార్చేయగలదు. కాబట్టి ఫైనల్‌ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా. గత సీజన్లో చెన్నై ఆడిన తీరు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మరణం ముప్పును తగ్గించే ఏఎల్‌ఏ

సోయాబీన్స్‌, నట్స్‌, మొక్కల నుంచి వచ్చే నూనెల్లోని ఉండే ఆల్ఫా లినోలెనిక్‌ ఆమ్లాన్ని (ఏఎల్‌ఏ) తీసుకోవడం వల్ల గుండె, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించే ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏఎల్‌ఏ అనేది ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లం. గుండె జబ్బుతో మరణాలను తగ్గించడంలో ఈ పదార్థం పాత్రపై ఇప్పటివరకూ అస్పష్టత నెలకొంది. దీన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఎల్‌ఎఫ్‌టీతో కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

3. Pelli SandaD: విందు భోజనం పెళ్లి సందడి

కమర్షియల్‌ సినిమా..కె రాఘవేంద్రరావు ముందు, తర్వాత అనేంతగా ప్రభావం చూపించిన దర్శకుడు. ఆయన సినిమా అంటే వాణిజ్య ఇంద్రజాలం. ఆయన కథానాయిక ఓ స్వప్న సుందరి. ఆయన సినిమాలోని పాటే సౌందర్య లహరి. తరాలు మారినా దర్శకేంద్రుడి సినిమాకి మాత్రం నిత్య యవ్వనం. పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో మరో చిత్రం తెరకెక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Huzurabad By-election: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌పోల్‌ సర్వే నిర్వహించొద్దని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆర్‌వీ.కర్ణన్‌ స్పష్టం చేశారు. వాటిపై నిషేధం విధించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబరు 30 రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించరాదని, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురించరాదని, వాటిని ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రంగంలో దిగనున్న అగ్రనేతలు

5. సావర్కర్‌ సముద్రంలో దూకిన వేళ...

తాజాగా దేశ రాజకీయ చర్చల్లో బాగా నలుగుతున్న పేరు వీర్‌ సావర్కర్‌! మహాత్ముడి హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని... తర్వాత కోర్టు ద్వారా నిర్దోషిగా బయటపడ్డారు సావర్కర్‌. స్వాతంత్య్రోద్యమ సమరంలో భాగంగా... తొలిసారి గాంధీజీని దసరా రోజే కలుసుకున్నారు. ఇద్దరూ కలసి లండన్‌లో ఒకే వేదిక పంచుకున్నారు. 1909 అక్టోబరు 24న లండన్‌లో భారతీయులంతా కలసి దసరా ఉత్సవాలు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గాంధీజీని రమ్మని ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మీ పని మాది...

ఇంట్లో పైపు లీకయినా, ఫ్యాన్‌ పాడయినా, ఏసీ మొరాయించినా..గ్యాస్‌ స్టవ్‌ వెలగకపోయినా హైరానా పడే పనే లేదు. యాప్‌లో ఒక్క క్లిక్‌తో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సెల్‌ఫోన్‌లో ఒక్క మీట నొక్కితే చాలు ఇంట్లో వివిధ మరమ్మతులు సహా వందల రకాల సేవల్ని ఇంటి ముంగిటకే వచ్చి అందిస్తున్న ‘ఆన్‌ డిమాండ్‌ హోమ్‌ సర్వీసెస్‌ యాప్‌’లదే ఇప్పుడు హవా. వినియోగదారులు కోరుకున్న సమయంలో అందుబాటు ధరల్లో సేవలు అందిస్తుండటంతో వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘కంప్యూటర్‌ సైన్స్‌’కే జై

7. ఆర్టీసీ రాబడిపై కన్ను!

వస్తున్న ఆదాయానికి, అవుతున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆర్టీసీ అప్పుల్లో ఉంది. గత సంవత్సరం జనవరి నుంచి ఆర్టీసీలోని కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్ల జీతాల భారం తగ్గడంతో.. ఆ మిగులు సొమ్ముతో రుణాలు, ఇతర బకాయిలు తీర్చేద్దామని ఆర్టీసీ భావించింది. ఇంతలో ఆర్టీసీకి వచ్చే రాబడిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కొవిడ్‌ అనంతరం ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. దాంతో, ఖర్చులన్నీ పోను మిగిలిన సొమ్ములో నెలకు రూ.50-100 కోట్లు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహిళా నేత...‘హనీ’వల

తనతో కలిసి నగ్నంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకుల చిత్రాలను చూపి బెదిరించి నగదు లాక్కుంటున్నారనే (హనీట్రాప్‌) ఆరోపణలపై ఓ జాతీయ పార్టీకి చెందిన మహిళ నాయకురాలిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉండటం, మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉన్నందున ఆమె వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కొప్పళ్‌కు చెందిన ఆమె నగరంలోని విజయనగరలో నివసిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’

9. పండగల వేళ.. కార్డులతో జాగ్రత్త

చుట్టూ రకరకాల ఆఫర్లు.. ఎక్కడ చూసినా.. రాయితీలు.. క్రెడిట్‌ కార్డులతో కొంటే నగదు వెనక్కి.. పండగల వేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో క్రెడిట్‌ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది.. లేకపోతే అనవసరంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. బిల్లులు సరైన సమయానికి చెల్లించకపోతే.. అప్పుల ఊబిలో చిక్కుకుపోవడమూ ఖాయం. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఏం చేయాలో తెలుసుకుందామా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. AP News:ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. ఉత్సవమూర్తుల జలవిహారం రద్దు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొమ్మిదో రోజు దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నేడు పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. నదిలో నీటి ఉద్ధృతి కారణంగా ఉత్సవ మూర్తులకు జలవిహారం రద్దుచేశారు. దసరా చివరి రోజు భారీగా భక్తులు పోటెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TTD: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం.. స్వామివారి సన్నిధిలో సీజేఐ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని