Top 10 News @ 9AM

తాజా వార్తలు

Updated : 25/04/2021 09:22 IST

Top 10 News @ 9AM

1. పరీక్షించిన ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌

కొవిడ్‌ మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి వైరస్‌ సోకినట్లు స్పష్టమవుతోంది. దీంతో పాజిటివిటీ రేటు దాదాపు 20 శాతంగా తేలింది. మార్చి 24న ఇది 5 శాతమే. నెల రోజుల వ్యవధిలోనే వైరస్‌ సంక్రమణ నాలుగు రెట్లు పెరిగింది. పరీక్షల సంఖ్య పెంచితే పాజిటివిటీ రేటు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. నిమిషానికి ఒకరికి ఆక్సిజన్‌ చికిత్స 

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లక్షణాలు కనిపిస్తున్నా సకాలంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్స పరంగా నిర్లక్ష్యం చేస్తున్న కొద్దీ, ఇతర వ్యాధులున్న బాధితుల పరిస్థితి తీవ్రమవుతోంది. వారిలో 30 శాతం మందికి ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌పై చేరికలు గణనీయంగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 18,506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. తాగునీటిలో వైరస్‌.. ప్రమాదకరం కాదు 

తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్‌ బతికి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు జూమ్‌లో శనివారం ఆయన సీసీఎంబీలో కొవిడ్‌ వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్యతేజ్‌, కార్తీక్‌లతో కలిసి మాట్లాడారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. కొవిడ్‌ మృత్యు కౌగిలి 

రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం(23న) ఒక్కరోజే కరోనాతో చికిత్స పొందుతూ అత్యధికంగా 33 మంది చనిపోయారు. రాష్ట్రంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి రాష్ట్రంలో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 105 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య గణాంకాలు వెల్లడిస్తున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. వ్యాక్సిన్‌ తీసుకునే ముందు..ఎలాంటి ఆహారం తీసుకోవాలి

రెండో దశలో కరోనా వైరస్‌ త్వరత్వరగా మారిపోతూ వేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం ద్వారా వైరస్‌ను ఎదుర్కోగలమని రోజూ వింటున్నాం. అయితే వ్యాక్సిన్‌ వేయించుకున్నవాళ్లలో కొందరికి అలర్జీలూ నొప్పులూ వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే వ్యాక్సిన్‌ వేయించుకునే ముందూ తరవాతా కూడా ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు హార్వర్డ్‌ నిపుణులు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. కరోనాకూ వెరవని దుర్గలు!

రపంచవ్యాప్తంగా ఎటుచూసినా కరోనా రెండో విజృంభణ. వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వైరస్‌ నుంచి ప్రజలను కాపాడే బాధ్యతల్లో కొందరు మహిళలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. సేవకు, ధైర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు. దేశమంతా జేజేలు పలుకుతున్న వారి స్ఫూర్తి గాథలను మనమూ చూద్దాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. వ్యాక్సిన్‌ తీసుకుంటేనే రేషన్‌.. పెన్షన్‌

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతోన్నా.. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి కొందరు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని గ్రామాల్లో టీకా తీసుకుంటేనే రేషన్‌ ఇస్తామని, ఆసరా పింఛను సొమ్ము పంపిణీ చేస్తామని శనివారం చాటింపు వేయించారు.  తహసీల్దార్‌ సువర్ణ రేషన్‌ డీలర్లతో సమావేశమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

8. రక్షణనిచ్చే రుచులు!

పండ్లంటే నోరూరించే రుచులు... పోషకాల ఖజానాలు...తక్షణ శక్తినిచ్చే పానీయాలు... అంతేకాదండోయ్‌! కాస్త వెరైటీగా తయారు చేస్తే...మండే ఎండల్లో మేనికి చల్లదనాన్నిస్తాయి...జబ్బుల నుంచి రక్షణనిచ్చే కవచాలుగా మారతాయి...వివిధ రకాల పండ్లతో ఆ లాభాలు పొందడం ఎలాగంటే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఆగస్టు నాటికి బయోలాజికల్‌ ఇ. కొవిడ్‌-19 టీకా?

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ కొవిడ్‌-19 టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు చేపట్టనుంది. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఈ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ఆగస్టు నాటికి పూర్తవుతాయని, ఆ తర్వాత వెంటనే టీకా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. రాజస్థాన్‌ అదరహో..

ఐపీఎల్‌ 14వ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న రెండు జట్ల మధ్య పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ పైచేయి సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్‌లో పరుగుల కోసం ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌ కష్టపడగా.. తొలి మ్యాచ్‌లో వీరోచిత శతకం తర్వాత వరుస వైఫల్యాలు చవిచూసిన రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌, ఈసారి కుదురుగా ఆడి జట్టును గెలిపించాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని