CJI జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు
close

తాజా వార్తలు

Published : 12/06/2021 17:47 IST

CJI జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీజేఐని కలిశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి దేశ అత్యున్నత పదవిలో నియామకం కావడం యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణంగా ఉందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచడం, న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని ఆదేశించడంపై ఉత్తమ్‌ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి.. జస్టిస్‌ ఎన్వీ రమణను  కలిసి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అభినందించారు.

రాజకీయ ప్రక్షాళన చేయాలి..
ఎన్నికల నియమావళిలో మార్పులు తెచ్చి రాజకీయ ప్రక్షాళన చేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి రాజ్ భవన్‌లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నియమావళిలో సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యులు సైతం పోటీ చేసేలా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కడియం శ్రీహరి కోరారు. జస్టిస్ రమణ నేతృత్వంలో భారత న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని వారు ఆకాంక్షించారు.

న్యాయవాదుల సంక్షేమానికి చొరవ చూపాలి..
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు కలిశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచినందుకు జస్టిస్ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలో న్యాయవాదుల శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి సీజేఐని కోరారు. రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని