కోలుకుంటున్న సూర్యాపేట బాధితులు

తాజా వార్తలు

Published : 24/03/2021 12:54 IST

కోలుకుంటున్న సూర్యాపేట బాధితులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్యాపేటలో స్టేడియం కూలిపోయిన ఘటనలో గాయపడిన బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఎముకలు విరిగిన పలువురికి వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. బాధితులు, వారి బంధువులతో జిల్లా ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ప్రమాద బాధితులకు తొలుత ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రైవేటు ఆసుపత్రులు ఆ తర్వాత ప్రాంతీయ, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం మరో 24 మందిని హైదరాబాద్‌లోని నిమ్స్‌, కామినేని ఆసుపత్రులకు తరలించారు.

మరోవైపు 47వ జూనియర్‌ కబడ్డీ పోటీలు రెండోరోజు ఉత్కంఠభరితంగా సాగాయి. క్రీడల ప్రారంభంలో జరిగిన అపశ్రుతిని పరిగణనలోకి తీసుకొని జిల్లా అధికారులు రెండోరోజు గ్యాలరీలపైకి ప్రేక్షకులను వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూలిన గ్యాలరీని తొలగించిన అధికారులు దాని స్థానంలో కుర్చీలు వేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని