AP News: పసుపు రంగు కప్పల్ని చూశారా..!

తాజా వార్తలు

Published : 27/06/2021 21:07 IST

AP News: పసుపు రంగు కప్పల్ని చూశారా..!

మోపిదేవి: కప్పలు అరిస్తే వర్షాలు పడతాయన్నది కొందరి విశ్వాసం. అయితే కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కురిస్తే కప్పలు బయటకొస్తాయి. అవి కూడా సాధారణమైనవి కాదు.. ‘ఇండియన్ బుల్ ఫ్రాగ్’ జాతికి చెందిన అరుదైన రకం. మోపిదేవి మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి భూమిలో నుంచి ఈ పసుపు పచ్చ కప్పలు బయటకొచ్చాయి. వర్షాకాలం ఆరంభంలో ఇలా పసుపు రంగులోకి మారతాయని.. ఒకట్రెండు రోజులు కనిపించి మళ్లీ భూమిలోకి వెళ్లిపోతాయని రైతులు వెల్లడిస్తున్నారు. గతంలో ఈ కప్పలు భారీగా కనిపించేవని ఇప్పుడు బాగా తగ్గిపోయినట్లు పేర్కొంటున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని