AP News: ఉక్కు కార్మికుల ఒక్కరోజు సమ్మె

తాజా వార్తలు

Updated : 29/06/2021 09:58 IST

AP News: ఉక్కు కార్మికుల ఒక్కరోజు సమ్మె

విశాఖ: అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమలో కార్మికులు ఒక్క రోజు సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు నినదించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. వేతన ఒప్పందం వెంటనే అమలు జరపాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో మరణించిన కార్మికుల కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఉక్కు పరిశ్రమ యాజమాన్యం తన నిరంకుశ వైఖరితో వేతన ఒప్పందాన్ని జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన ఒప్పందానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలుగా వేతన ఒప్పందం జరగకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు సమ్మెలో 14 కార్మిక సంఘాలు పాల్గొని నిరసన తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని