close

తాజా వార్తలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురి మృతి

రైల్వేకోడూరు: గుర్తు తెలియని వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా కంకల్‌కు చెందిన ఓ కుటుంబం చిన్నారి ఆసుస్‌(10నెలలు) కేశఖండన నిమిత్తం తిరుమల బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు రాఘవరాజపురం వద్దకు చేరుకోగానే అటువైపుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహన చోదకుడు బాలు, ప్రశాంత్‌తో సహా మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వాణి(22), శ్రీనివాస్‌‌(32), ప్రియాంక(21), రమాదేవి(50)కి బలమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్నారి ఆసుస్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను 108వాహనంలో తిరుపతి రుయాకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.