ప్రధానాంశాలు

Published : 15/10/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రిలయన్స్‌ రిటైల్ చేతికి రూ.5,550 కోట్ల నగదు..!

1.28 శాతం వాటాను కొనుగోలు చేసిన కేకేఆర్ 

దిల్లీ: తమ రిటైల్ విభాగంలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేర్‌ నుంచి రూ.5,550 కోట్ల నగదు అందినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్‌ఐఎల్‌) గురువారం ప్రకటించింది. దాంతో రిటైల్ విభాగంలో 1.28 శాతం వాటా ఆ సంస్థ సొంతమైనట్లు తెలిపింది. ఈ ఈక్విటీ వాటా కొనుగోలుకు కేకేఆర్ ముందుకు వచ్చినట్లు సెప్టెంబర్‌ 23న ఆర్‌ఐఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేకేఆర్‌ విభాగమైన అలీసమ్ ఏషియా హోల్డింగ్స్‌ నుంచి రిలయన్స్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రూ. 5,550 కోట్లు మొత్తాన్ని పెట్టుబడిగా పొందింది. దాని కింద 8,13,48,479 ఈక్విటీ షేర్లను ఆ సంస్థకు కేటాయించాం’ అని ఆర్‌ఐఎల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కాగా, వాటాల విక్రయాలకు ముందు కిరాణ దుకాణాలు, ఫ్యాషన్ రంగ వ్యాపారాలను నిర్వహిస్తోన్న రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.4.21లక్షల కోట్లుగా ఉంది. 

ఇక, ఆర్‌ఐఎల్‌లో కేకేఆర్ పెట్టిన రెండో పెట్టుబడి ఇది. అంతకు ముందు డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్ రంగం, ఆన్‌లైన్‌ కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్ల ద్వారా  ఈ రిలయన్స్‌ రిటైల్ విభాగం భారత్ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ మానిటైజేషన్ తర్వాత ఆర్‌ఐఎల్ రిటైల్ వ్యాపారంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. కేకేఆర్‌తో పాటు ఇతర అమెరికన్‌ సంస్థలైన సిల్వర్‌ లేక్, జనరల్‌ అట్లాంటిక్ కూడా ఈ రిటైల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు గతంలో రిలయన్స్‌ సంస్థ వెల్లడించింది.   

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net