ప్రధానాంశాలు

Published : 10/05/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
covid: పియూష్ చావ్లా తండ్రి కన్నుమూత

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి క్రీడాకారుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూశారు. టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా తండ్రి ప్రమోద్‌ కుమార్‌ చావ్లా సోమవారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పియూష్ తన తండ్రితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘మేం ఎంతగానో ప్రేమించే మా తండ్రి మిస్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ చావ్లా 2021, మే 10న  కన్నుమూశారని తెలిపేందుకు చింతిస్తున్నాం. ఆయన కొవిడ్‌, తదనంతర సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మీరంతా ప్రార్థించాలని కోరుతున్నా’ అని పియూష్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ‘ఆయన లేని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నా బలాన్ని ఈ రోజు కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన పియూష్‌ ఈ సారి ముంబయికి ఆడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయి ఇండియన్స్‌ అతడికి అండగా నిలిచింది. ఇర్ఫాన్ పఠాన్‌ సైతం ప్రమోద్‌ మృతిపట్ల సంతాపం ప్రకటించాడు.COrb35zlwud

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net