ప్రధానాంశాలు

Published : 10/05/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Covid Vaccine వేయించుకున్న కోహ్లీ, ఇషాంత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లు కొవిడ్‌-19 టీకాలను వేయించుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, పొడగరి పేసర్‌ ఇషాంత్‌ శర్మ టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకొన్నారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకొని రక్షణ పొందాలని సూచించారు.

భారత్‌ త్వరలోనే ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. మొదట న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. ఆ తర్వాత నెల రోజులు భారత బృందమే రెండు జట్లుగా విడిపోయి సన్నాహక మ్యాచులు ఆడతాయి. ఆపై ఆంగ్లేయులతో సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీసేన తలపడనుంది. పర్యటనకు సిద్ధమయ్యే లోపే వీలైనంత మేరకు క్రికెటర్లు వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు.

కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, మిగతా సిబ్బందిని విరాట్‌ కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమకు తోచిన రీతిలో సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక నిధిని ఏర్పాటు చేశారు. రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ నిధి మొత్తం 24 గంటల వ్యవధిలోనే రూ.3.6 కోట్లకు చేరుకుందని వెల్లడించారు.



1391257413400080385

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net