
తాజా వార్తలు
గ్రేటర్పోరు: భాజపా అభ్యర్థి భర్తపై పిడిగుద్దులు!
గన్‌ఫౌండ్రి: బీ ఫారం కోసం వచ్చిన భాజపా అభ్యర్థి భర్తపై టికెట్ ఆశించి భంగపడిన నాయకుడి వర్గీయులు చేయి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గన్‌ఫౌండ్రి డివిజన్ భాజపా అభ్యర్థిగా భాజపా నాయకుడు ఓం ప్రకాష్ సతీమణి డా.సురేఖకు టికెట్ కేటాయించారు. ఓంప్రకాష్ తన భార్యతో కలిసి బీ ఫారం కోసం భాజపా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టికెట్ ఆశించి భంగపడిన భాజపా నేత శైలేందర్ వర్గీయులు ఓం ప్రకాష్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడి ఆయన చొక్కా చించేశారు. బీఫారం లాక్కునేందుకు ప్రయత్ని్ంచగా ఓం ప్రకాష్ అప్పటికే తన అనుచరుల ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు దాన్ని అందజేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన శైలేందర్ వర్గీయులు కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు.