బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు:చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 02/06/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు:చంద్రబాబు

‘నవ్వులపాలైన తెలుగువారు’ పేరిట వీడియో విడుదల

అమరావతి: వైకాపా చేతకాని పాలనతో దేశవిదేశాల్లోని తెలుగువారు నవ్వులపాలయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘నవ్వులపాలైన తెలుగువారు’ పేరిట ట్విటర్‌లో ఆయన వీడియో విడుదల చేశారు. ప్రభుత్వం చేస్తున్న దౌర్జర్యాలు చూసి ‘బిహార్‌ ఆఫ్‌ సౌత్‌’, ‘గవర్నమెంట్‌ టెర్రరిజం’ అంటూ అవమానించే పరిస్థితి వచ్చిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ రద్దు, మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి చర్యలతో రివర్స్‌ పాలన, తుగ్లక్‌ 2.0 అని అంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ఎవరైనా పెట్టుబడులతో వస్తే ఏపీని చూపించేవారని.. ఇప్పుడు వైకాపా అరాచకాలతో దేశానికే పెట్టుబడులు రాని దుస్థితి నెలకొందన్నారు.

వాటాల కోసం పెట్టుబడిదారులను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. దావోస్‌ సదస్సులో గతంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఏపీని వేధింపులకు వేదికగా చేశారని ఆరోపించారు. పాలకులు బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని.. ఇలాంటి చేతకాని పాలకులతో రాష్ట్రం నవ్వుల పాలువుతోందన్నారు. విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా రాష్ట్రం ఎదిగిందని.. ఐదేళ్ల పాటు రెండంకెల వృద్ధి రేటు సాధించి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉండేదన్నారు. అనేక రంగాల్లో దేశంలో నంబర్‌ వన్‌గా ఎదిగిందన్నారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఏపీ 667 అవార్డులు సాధించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని