close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనాలో బుబోనిక్‌ ప్లేగు వ్యాప్తి..!  

 వారం వ్యవధిలోనే మరోసారి ప్రమాద ఘంటికలు

బీజింగ్: చైనాలో బుబోనిక్‌ ప్లేగు మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధరించాయి. ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వీరిని వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరితో సంబంధాలు ఉన్న 146 మందిని ఐసోలేట్‌ చేశారు. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డెయిలీ వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఏడాది చివరి వరకు లెవల్‌-3 హెచ్చరికను జారీ చేశారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యశాఖ కూడా ధ్రువీకరించింది. ప్రజలు వారి వ్యక్తిగత పరిశుభ్రత రక్షణను మెరుగుపర్చుకోవాలని కోరింది. 

ఈ సారి కూడా మాంసమే కారణం..

తాజాగా బుబోనిక్‌ ప్లేగు వ్యాపించడానికి అడవి జంతువు మాంసమే కారణమైంది. ముర్మోట్‌ అనే ఉడుత జాతి జంతువు మాంసం తినడం వల్ల బుబోనిక్‌ సోకినట్లు భావిస్తున్నారు. దీంతో ఆ మాంసం తినొద్దని హెచ్చరికలు జారీ చేశారు. గతంలోనూ సార్స్‌ కోవ్‌2 గబ్బలిం మాంసం వల్లే వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా వ్యాపించిన బుబోనిక్‌ ప్లేగును గుర్తించి వైద్యం చేయకపోతే 24 గంటల్లో మనిషి ప్రాణం తీయగలదు. గతేడాది ఈ జంతువు మాంసం తిని పశ్చిమ మంగోలియాలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇటీవలే జీ4 వైరస్‌..

సరికొత్త స్వైన్‌ఫ్లూ వైరస్‌ జీ4 అత్యంత ప్రమాదకరమని చైనాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒకటి పీఎన్‌ఏఎస్‌ అమెరికా జర్నల్‌లో ఇటీవలే ప్రచురించింది. జీ4 మనుషులకు వేగంగా వ్యాపించగలదని, మహమ్మారిగా మారే సామర్థ్యం ఉందని హెచ్చరించింది. అయితే ఈ అధ్యయనాన్ని చైనా ఖండించింది. జీ4 వైరస్‌ స్ట్రెయిన్‌పై మీడియాలో వచ్చిన వార్తలు అతిగా ఉన్నాయని, అందులో శాస్త్రీయత లేదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అధ్యయనంలో తీసుకున్న నమూనాల పరిమాణం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. పందుల్లో జీ4 స్ట్రెయిన్‌ ప్రమాదకరంగా మారుతుందనేందుకు సరైన ఆధారాలు చూపలేదని విమర్శించింది.

బుబోనిక్‌ ప్లేగు అంటే బ్లాక్‌డెత్‌

జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా 800 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగుగా మళ్లీ ప్రజలపై విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 1347లో యూరప్‌ మొత్తం వ్యాపించింది. దీని బారిన పడి నాలుగేళ్లలో 20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో ఇదొక భయానక సంఘటన. అయితే ఈ వ్యాధిని ఎలా నయం చేయాలో తెలియకపోయినా ఒకరి నుంచి మరొకరిని వ్యాపిస్తుందని తెలుసుకున్న ప్రజలు వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్‌ చేయడం మొదలుపెట్టారు. వ్యాధి నిర్థరణ అయిన వ్యక్తులను ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు.. అప్పటి అధికారులు రోమన్‌ అధీనంలో ఉన్న ఓడరేవు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఓడల ద్వారా వచ్చిన వ్యక్తులను తొలుత ఐసోలేషన్‌లో ఉంచారు. 40 రోజులపాటు క్వారంటైన్‌ చేసిన తర్వాత వారికి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే రాజ్యంలోకి అనుమతిచ్చేవారు. అలా వ్యాధి సోకిన వాళ్లు మరణించగా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నవారు బతికి బట్టగట్టారు. అయితే ఈ ప్లేగు అంత త్వరగా అంతం కాలేదు. పలుమార్లు యూరప్‌ దేశంపై పగబట్టినట్లు దాడి చేసింది. లక్షలమంది ప్రాణాలు బలితీసుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.