మరోసారి ఆస్పత్రిలో చేరిన కెప్టెన్‌
close

తాజా వార్తలు

Published : 07/10/2020 13:22 IST

మరోసారి ఆస్పత్రిలో చేరిన కెప్టెన్‌

చెన్నై: ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రాజకీయ నాయకుడు, నటుడు విజయకాంత్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయనకి కొవిడ్‌-19 పరీక్షల నిర్వహించగా.. పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో చికిత్స అనంతరం ఈ నెల 2న ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విజయకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేస్తూ.. డీఎండీకే పార్టీ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ఇటీవల కొవిడ్‌-19 నుంచి కోలుకున్న విజయకాంత్‌.. తన తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మకండి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని