
తాజా వార్తలు
ముంబయి పవర్ కట్ వెనుక సైబర్ దాడి!
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరంలో అక్టోబరు 12న గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే సైబర్ దాడి కారణంగానే పవర్ కట్ జరిగిందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ముంబయి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పవర్ సప్లయ్, ట్రాన్స్మిషన్కు సంబంధించిన సర్వర్లలో అనుమానాస్పద లాగిన్లను సైబర్ విభాగం అధికారులు గుర్తించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. సింగపూర్, దక్షిణ ఆసియాకు చెందిన కొన్ని దేశాలకు చెందిన హ్యాకర్లు ఈ లాగిన్లు చేసినట్లు తేలిందట. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
లోడ్ డిస్ప్యాచ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా ప్రాథమికంగా నిర్ధారించిందేనని, పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని సైబర్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. సైబర్ ముప్పుపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
అక్టోబరు 12న ముంబయిలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 గంటల తర్వాత క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేదు. నగరానికి విద్యుత్ సరఫరా చేసే టాటాకు చెందిన గ్రిడ్‌లో లోపం తలెత్తడంతో పవర్ కట్ అయినట్లు అప్పుడు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు రైల్ సర్వీసులు రద్దయ్యాయి. ఆసుపత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
