close

తాజా వార్తలు

ఆ ఒక్కటీ నెరవేర్చలేక పోయా!: సునీత

అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవి చనిపోయి 15 ఏళ్లు గడిచినా ఇంకా అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారని ఆయన భార్య పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి 15వ వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చి రవికి నివాళులర్పించారు. అభిమానులు, కార్యకర్తల కోసం అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రవి చనిపోయిన నాటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తు్న్నామని చెప్పారు. అయితే, గత ఏడాది రవిఘాట్‌ వద్ద తనయుడు శ్రీరాంను గెలిపిస్తానని మాట ఇచ్చానని.. కానీ, అది ఒక్కటీ నెరవేర్చలేకపోయానన్న బాధ అలానే ఉండిపోయిందని ఆవేదన చెందారు. రానున్న రోజుల్లో రాప్తాడు, ధర్మవరంతోపాటు అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తామన్నారు. రవి చనిపోయి ఇన్నేళ్లు అయినా అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరవలేమని చెప్పారు. వారి రుణం తీర్చుకుంటూ రవి ఆశయ సాధనకు పనిచేస్తామని సునీత పేర్కొన్నారు. 

రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపురంకు వచ్చిన పలువురు తెదేపా నాయకులతో సునీత కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు అంశాలపై మాట్లాడారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. మండలిలో ఛైర్మన్‌ స్థానానికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరగుతున్న దాడులు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ వీడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి మరణం తర్వాత తమతో పాటు పోతుల సురేష్‌ కుటుంబానికి చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. అవన్నీ మరచి పార్టీ మారటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని సునీత పేర్కొన్నారు.  

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.