close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం విజయవంతం

ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సి48 ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ఈ మేరకు ప్రకటించారు. వాహకనౌక మోసుకెళ్లిన 10 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రయోగం విజయవంతం కావదం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రాష్ట్రమంతా ‘హెల్త్‌ప్రొఫైల్‌’:కేసీఆర్‌

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సూచీ (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారీకి అవసరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే దాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. పట్టణంలో మహతి ఆడిటోరియం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ ‘మహతి’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. భారత ముస్లింలు చింతించొద్దు: అమిత్‌ షా

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని భాజపా ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పెట్టిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ హామీ మేరకే నేడు దానికి చట్టరూపం కల్పిస్తున్నామని తెలిపారు. దీన్ని ఆయన ఒక చరిత్రాత్మక బిల్లుగా అభివర్ణించారు. దీనివల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మైనారిటీలకు హక్కులు లభిస్తాయన్నారు. ఈ బిల్లు శరణార్థుల హక్కులు కాపాడుతుందన్నారు. ఈ బిల్లు విషయంలో భారత ముస్లింలు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు బాధ్యత సుప్రీం మాజీకి..?

దేశంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ ‘దిశ’ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టంచేశారు.  దిల్లీలోనే ఉండి ఆయన ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు మాజీ జస్టిస్‌ పి.వి.రెడ్డిని సంప్రదించామని.. కానీ, అందుకు ఆయన నిరాకరించారని చెప్పారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సమీకృత మార్కెట్‌ ప్రారంభించిన కేసీఆర్‌

గజ్వేల్‌లో ఆరున్నర ఎకరాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ విపణిలో మొత్తం ఆరు బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించనుంది. 16 వాణిజ్య దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌, చిన్నారుల కోసంఉద్యానవనం ఏర్పాటుతో ఈ మార్కెట్‌ ప్రాంగణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రాహుల్‌ ఒక్కడే సరైనోడు: అశోక్‌ గెహ్లోత్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ గత ఐదేళ్లలో పాలించిన తీరుపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ మరోసారి గళమెత్తారు. మోదీకి ధీటైన సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్‌ గాంధీనే అని ఆయన పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను ధైర్యంగా ఎదుర్కొగల సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు గాంధీ అని ఆయన మీడియాకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఇస్రో హాఫ్‌ సెంచరీ!

ఇస్రో అంతరిక్ష రేసులో ఓ కీలక మైలురాయిని అధగమించింది. నేడు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ48తో మొత్తం ఈ సిరీస్‌లో 50 అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించినట్లైంది. మన శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన 75 మిషన్‌ ఇది. ఇక వాణిజ్య పరంగా ఇస్రో 319 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చింది. సీ47 ప్రయోగంతో 300 మార్కును దాటి 310కి చేరింది. ఇస్రో ఈసారి మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ-సీ48 ద్వారా నింగిలోకి పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. జీఎస్‌టీ రేట్లు పెంపు.. శ్లాబులు కుదింపు?

రెవెన్యూలోటుతో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్లాబులను కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. లాభాల్లో మార్కెట్లు.. 11900 పైన నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చివరి గంటలో కొనుగోళ్ల అండ లభించడంతో నిఫ్టీ 11,900 పాయింట్ల పైన ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 172 పాయింట్ల లాభంతో 40,412 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 11,910 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ వచ్చేసింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠ‌పుర‌ములో..’ సినిమా టీజర్‌ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు. టీజర్‌ కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.