ఫడణవీస్‌కు ఇప్పుడు తెలిసొచ్చుంటుంది: రౌత్‌
close

తాజా వార్తలు

Published : 26/10/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫడణవీస్‌కు ఇప్పుడు తెలిసొచ్చుంటుంది: రౌత్‌

ముంబయి: కొవిడ్‌-19 బారిన పడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌నుద్దేశించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బయట పరిస్థితి ఏ విధంగా ఉందో ఫడణవీస్‌కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉద్ధవ్‌ అస్సలు ఇంటి నుంచి బయటకు రావట్లేదంటూ ఇటీవల భాజపా విమర్శలు చేసిన నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడుతూ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బయట పరిస్థితి బాగాలేదని, జాగ్రత్తగా ఉండాలని ఫడణవీస్‌కు తాము సూచించామని రౌత్‌ చెప్పారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం ఉద్ధవ్‌.. ఆస్పత్రి వర్గాలకు సూచించినట్లు తెలిపారు. ఫడణవీస్‌కు శనివారం కరోనా పాజిటివ్‌ అని తేలిన సంగతి తేలింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మరోవైపు దసరా వేడుకల గురించి రౌత్‌ను ప్రశ్నించగా.. ఒకవేళ కొవిడ్‌-19 లేకపోయి ఉంటే ఉద్ధవ్‌ దసరా ప్రసంగం వినేందుకు వచ్చే శివ సైనికులతో సెంట్రల్‌ ముంబయిలో ఉన్న శివాజీ పార్క్‌ నిండిపోయి ఉండేదని రౌత్‌ జోస్యం చెప్పారు. గతేడాది జరిగిన దసరా వేడుకల్లో రాబోయే ఎన్నికల్లో శివసేనకు చెందిన వ్యక్తే సీఎం అవుతారని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, వ్యాక్సిన్‌ అనేది ప్రజలందరికీ అందించాల్సిందేనని, ఈ విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని