వేధింపులు భరించలేక బావిలో దూకిన బాలిక
close

తాజా వార్తలు

Published : 14/10/2020 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేధింపులు భరించలేక బావిలో దూకిన బాలిక

లఖ్‌నవూ: పోకిరీల వేధింపులు భరించలేక ఓ బాలిక బావిలో దూకి తనువు చాలించింది. ఆరు నెలలుగా వేధింపులకు పాల్పడుతుండడంతో తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికంగా ఉండే ముగ్గ్గురు యువకులు మంగళవారం రాత్రి తమ ఇంట్లోకి చొరబడి 11వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు తెలిపారు. గున్నూ తివారీ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి బాలికపై వేధింపులకు పాల్పడుతుండగా.. డబ్బూ సింగ్‌, గుడ్డూ అనే మరో ఇద్దరు తమను చంపేస్తామంటూ బెదిరించారని తెలిపారు. ఉదయం లేచిన తమ కుమార్తె బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలలుగా ఆ యువకులు బాలికపై వేధింపులకు పాల్పడుతున్నారని, సమాజంలో అవమానాలు భరించాల్సి వస్తుందనే కారణంతో ఇన్నాళ్లూ కేసు పెట్టలేదని వాపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ యువకుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని