ఆరోగ్య రంగంలో అనేక అవకాశాలు: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 11/06/2020 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య రంగంలో అనేక అవకాశాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా సంక్షోభం ఆరోగ్య రంగంలో అనేక అవకాశాలను తెరపైకి తీసుకొచ్చిందని.. వాటిని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం పోటీపడుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. చైనా నుంచి తరలిపోయే పరిశ్రమలను ఆకర్షించడం, రాష్ట్రంలో మరిన్ని భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ఆకర్షణలో వివిధ దేశాలతో పోటీపడే అవకాశాలు భారత్‌కు ఉన్నాయని.. ఈ క్రమంలో తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్‌ రాష్ట్రాలకు కేంద్రం మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలోని అన్ని రకాల పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో దుకాణాలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయని వివరించారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలను ఆదుకునేందుకు విద్యుత్‌ బిల్లులతోపాటు, ఆస్తి పన్ను విషయంలోనూ పలు రకాల వెసులుబాట్లు కల్పించినట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు. కేంద్రం సైతం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున.. కరోనా పోరులో పౌరులు ప్రభుత్వానికి మరింత సహకరించాలని కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని