అత్యాచారానికి పాల్పడి.. కాళ్లూ, చేతులు కట్టేసి
close

తాజా వార్తలు

Published : 14/10/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యాచారానికి పాల్పడి.. కాళ్లూ, చేతులు కట్టేసి

అవమానం భరించలేక బాలిక ఆత్మహత్య

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో యువతులు, బాలికలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. హాథ్రస్‌ ఘటనతో నిరసనలు చల్లారకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలికను ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టి కాళ్లు, చేతులు కట్టేసి ఓ నర్సరీ వద్ద పడేసి వెళ్లారు. అవమానం భరించలేని బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్రకూట్‌ నగరం కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో చేటుచేసుకుంది. అక్టోబర్‌ 8వ తేదీన ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లిన బాలికను గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అపహరించుకుపోయి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి కాళ్లూ, చేతులు కట్టేసి ఓ నర్సరీ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 

‘నా కూతురిని ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రహింసలు పెట్టారు. ఇంటి సమీపంలోని ఓ నర్సరీ వద్ద కాళ్లూ, చేతులు కట్టేసి పడిఉన్న నా కూతురిని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. నిందితుల పేర్లు తెలుసుకునేందుకు ప్రయత్నించాం. కానీ ఘటనతో తీవ్ర ఆందోళనలో ఉన్న నా కుమార్తె వారి పేర్లు చెప్పలేకపోయింది. విషయాన్ని పోలీసులకు తెలియజేశాం’ అని బాలిక తల్లి పేర్కొంది. అనంతరం తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. చిత్రకూట్‌ ఏఎస్పీ ప్రకాశ్ స్వరూప్‌ పాండే మాట్లాడుతూ ‘ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆత్మహత్యకు గల కారణాలను మృతురాలి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నాం’ అని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని