నిసర్గ తుపాను: ఊపిరి పీల్చుకున్న ముంబయి
close

తాజా వార్తలు

Published : 03/06/2020 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిసర్గ తుపాను: ఊపిరి పీల్చుకున్న ముంబయి

బలహీన పడిన తుపాను
తప్పించుకున్న ఆర్థిక రాజధాని
పలుచోట్ల నేలకూలిన చెట్లు.. ఒకరి మృతి

ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను సాయంత్రానికి బలహీన పడింది. రాత్రికి మరింత బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మధ్యాహ్నం రాయ్‌గడ్‌ జిల్లా అలీబాగ్‌ వద్ద ఈ తుపాను తీరం దాటింది. ఆ సమయంలో సుమారు 110 కి.మీ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పటికే కరోనా కారణంగా విలవిల్లాడుతున్న ముంబయి నగరం తుపాను నుంచి బయటపడింది. దక్షిణ అలీబాగ్‌ ప్రాంతంలో ఈ తుపాను తీరం దాటడం వల్లే ముంబయికి ముప్పు తప్పిందని ఐఎండీ పేర్కొంది. అలీబాగ్‌ ముంబయికి సుమారు 100 కిలోమీటర్లు దూరంలో ఉంది.

మరోవైపు తుపాను వల్ల రాయ్‌గడ్‌ జిల్లాలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలినట్లు రాయగడ్‌ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి వెల్లడించారు. అలీబాగ్‌ ప్రాంతంలో విద్యుత్‌ స్తంభం కూలి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. గాలుల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సాయంత్రం 7 గంటల వరకు నిలిపివేశారు.

గుజరాత్‌కూ తప్పిన ముప్పు

నిసర్గ ముప్పు గుజరాత్‌కు కూడా తప్పింది. ఆ రాష్ట్రంలో కేవలం వర్షాలు కురిశాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ గుజరాత్‌లో చిన్నపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఆ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 63 వేల మందికి పైగా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 
Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని