
తాజా వార్తలు
ఆరోజును ముంబయి మర్చిపోదు: అక్షయ్‌కుమార్
ముంబయి: 2008 నవంబరు 26ను ముంబయివాసులు ఎప్పటికీ మర్చిపోలేరని బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్‌కుమార్ అన్నారు. ముంబయి మారణహోమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. దేశ వాణిజ్య రాజధానిలో పన్నెండేళ్ల క్రితం పాక్ ఉగ్రవాదులు 10 మంది 12 చోట్ల నరమేధం సృష్టించారు. ఆ మారణహోమంలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఈ దుర్ఘటనపై అక్షయ్‌కుమార్ ట్విటర్ వేదికగా స్పందించారు. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రాఘవ లారెన్స్ తొలిసారిగా బాలీవుడ్లో దర్శకత్వం వహించిన ‘లక్ష్మి’ చిత్రంలో అక్షయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆసిఫ్, లక్ష్మి పాత్రల్లో అక్షయ్ నటన అందరినీ కట్టిపడేసింంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సూర్యవంశీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో మూడు సినిమాలతో అక్షయ్‌కుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- స్వాగతం అదిరేలా..
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
