close

తాజా వార్తలు

Published : 08/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 PM

1. ప్రధానిజీ దృష్టిసారించండి:ఐఎంఏ

కరోనా వైరస్‌పై చేస్తోన్న యుద్ధంలో ముందుండి పోరాడి, మనకు అండగా నిలుస్తున్నది వైద్యులే. కానీ ఈక్రమంలో వైరస్‌ బారిన పడి మరణిస్తోన్న వైద్యుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు మరణించారని, వారిలో ఎక్కువ మంది జనరల్‌ ప్రాక్టిషనర్లు ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) శనివారం వెల్లడించింది. ఈ అంశంపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కొలికోడ్‌: నివేదిక రాగానే దిద్దుబాటు చర్యలు

కొలికోడ్‌ విమాన ప్రమాదంపై విచారణ నివేదిక అందగానే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఛైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ అన్నారు. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. కరోనా వైరస్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్‌ మిషన్‌లో భాగంగా స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఇప్పుడు భాజపా టర్న్‌.. రిసార్టులకు ఎమ్మెల్యేలు!

అసెంబ్లీ సమావేశాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. నిన్నటి వరకు తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు ఓ చోట... సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు మరో చోట రిసార్టుల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు భాజపా వంతు వచ్చింది. అశోక్‌ గహ్లోత్‌ ఒత్తిళ్ల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని గుజరాత్‌ తరలిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో కరోనా: మళ్లీ పదివేలు దాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరోసారి ఒక్కరోజులోనే కేసులు పది వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో (ఉదయం 9గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు) కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. ఇవాళ మరో 97 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 1,939 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అయోధ్య భూమిపూజను ఎంతమంది వీక్షించారంటే?

అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు ప్రసార భారతి సీఈవో శశి ఎస్‌ వెంపటి తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్‌ లభించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కొత్త సరకులు.. ధరలకు రెక్కలు

ఒకప్పుడు శానిటైజర్‌ అంటే ఏ కొద్ది మందో వినియోగించేవారు. దాని పేరు కూడా చాలా మందికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ పేరు తెలియని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరోనా మహమ్మారి తెలియకుండానే మానవ జీవనశైలిని మార్చేస్తోంది. పాత అలవాట్లు పోయి కొత్త పద్ధతులు అలవడుతున్నాయి. వైరస్‌ నియంత్రణ కోసం శానిటైజర్లు, పోషకాహార సరకుల వినియోగం పెరిగింది. బయట తిండి దాదాపుగా మానేసిన జనం ఇంట్లోనే వండుకుని తింటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. TS: మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీడియోలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నానని అన్నారు. ధైర్యంగా, జాగ్రత్తగా ఉంటే కరోనాను జయించవచ్చని చెప్పారు. 

8. ప్రమాదం అంచున మరో టేబుల్‌ టాప్‌ విమానాశ్రయం...

కేరళలోని కొలికోడ్‌లో శుక్రవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ఎయిర్‌ ఇండియా విమానం రన్‌వేపై అదుపుతప్పి 35 అడుగుల లోయలో పడిపోయింది. దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటన, గతంలో మంగుళూరులో జరిగిన ప్రమాదాన్ని గుర్తు తెచ్చింది. ఈ రెండూ టేబుల్‌ టాప్‌ రన్‌వేలపైనే చోటుచేసుకోవలం గమనార్హం. ఇదే విధమైన ప్రమాదం దేశంలో మరో విమానాశ్రయానికి కూడా పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కరోనా సోకితే.. ఒళ్లంతా కలకలం!

కరోనా దాడి కేవలం ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే పరిమితం కావడంలేదు. మన ఒంట్లోని అణువణువునీ ప్రభావితం చేస్తోంది. తల మొదలుకొని పాదాల వరకు శరీరంలోని అనేక అవయవాలపై ఈ వైరస్‌ ప్రభావం, దాడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇవన్నీ తెలుసుకోవడం భయపడటానికి కాదు. తెలుసుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో దేహంలో కరోనా వైరస్‌ దాడి గురించి అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వైభవంగా రానా- మిహీకా వివాహం

సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం వైభవంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.