close
Array ( ) 1

తాజా వార్తలు

జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు మరో అవకాశం..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో అని ప్రకటించిన ఎన్‌టీఏ

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుని జేఈఈ మెయిన్స్‌ 2020 దరఖాస్తు చేయని విద్యార్ధులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తన ట్విటర్‌ ఖాతాలో ఒక ప్రకటన చేశారు. ‘‘విదేశాల్లో చదువుకోవాలనుకునే ఆలోచన మానుకుని, ప్రస్తుతం భారత్‌లో విద్యాభ్యాసానికి ఆసక్తి ఉన్న అభ్యర్ధుల కోసం త్వరలో ఒక ప్రకటన రాబోతోంది’’ అని తెలిపారు.  

చాలా మంది భారతీయ విద్యార్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు, కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన  పరిస్థితుల కారణంగా విదేశాల్లో విద్యనభ్యసించాలనే ఆలోచన మానుకొని, భారత్‌లో చదువుకోవాలనే  విద్యార్ధులకు మరోసారి జేఈఈ మెయిన్స్‌ 2020కి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. మే 19 నుంచి మే 29, 2020 సాయంత్రం 5 గంటల వరకు అర్హత కలిగిన అభ్యర్ధులు జేఈఈ మెయిన్స్‌ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.