close

తాజా వార్తలు

Published : 14/05/2020 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాలు ఆవిరి.. నిఫ్టీ 9,150 దిగువకు

ముంబయి: ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన అండతో బుధవారం దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు గురువారం డీలాపడ్డాయి. నిన్నటి లాభాలు ఆవిరయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సూచీలు నష్టాలు చవిచూశాయి. వృద్ధిపై దీర్ఘకాలం పాటు కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందన్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరికల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు కారణం.

నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 885.72 పాయింట్లు కోల్పోయి 31,122.89 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 240.80 పాయింట్లు కోల్పోయి 9,142.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.56గా ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారతీ ఇన్ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హీరో మోటోకార్ప్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో చవిచూశాయి. రంగాల వారీగా చూసినప్పుడు ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని