close

తాజా వార్తలు

Published : 09/10/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాసవాన్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి 

దిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాసవాన్‌ గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తదితరులు పాసవాన్‌ పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కేంద్రమంత్రి మృతికి సంతాప సూచకంగా రాష్ట్రపతిభవన్‌, పార్లమెంట్‌పై జాతీయ జెండాలను అవనతం చేశారు. శనివారం పట్నాలో పాసవాన్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. 

వర్తమాన రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన పాసవాన్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్‌ పాసవాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బిహార్‌ ఎన్నికల సమయంలో పాసవాన్‌ మృతిచెందడం ఆ పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది. 

ఇదీ చదవండి: దళిత దిగ్గజ నేత కన్నుమూత 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన