close
Array ( ) 1

తాజా వార్తలు

జూనియర్‌ ద్రవిడ్‌ అదరగొట్టాడు!

ముంబయి: రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్ ద్రవిడ్‌ బ్యాటింగ్‌లోనే కాదూ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇప్పటికే మైదానంలో పరుగుల వరద పారిస్తూ.. తండ్రికి తగ్గ కుమారుడిగా పేరుతెచ్చుకున్న అతడు ఈ సారి బంతితోనూ మెరిశాడు. అండర్‌-14 బీటీఆర్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో విద్యాషిల్ప్‌ అకాడమీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శతకంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మాల్యా అదితి అంతర్జాతీయ పాఠశాల సెమీస్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్యా జట్టు 50 ఓవర్లో అయిదు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సమిత్‌ ద్రవిడ్‌ 131 బంతుల్లో 166 పరుగులు చేశాడు. దీనిలో 24 బౌండరీలు ఉన్నాయి. అతడితో పాటు అన్వయ్‌ కూడా 90 పరుగులతో మెరిశాడు.

అనంతరం బరిలోకి దిగిన విద్యాషిల్స్‌ 38.5 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. సమిత్‌ 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఇదే టోర్నమెంట్‌లో జూ.ద్రవిడ్‌ ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే. శ్రీ కుమారన్‌ జట్టుపై 33 బౌండరీలు బాది 204 పరుగులు చూశాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అండర్‌-14 రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ సమిత్‌ ద్రవిడ్‌ రాణించాడు. కోల్‌కతాలో జరిగిన అండర్‌-14 జోనల్‌ టోర్నీలో వైస్‌ ప్రెసిడింట్స్‌ XI తరఫున ధార్వాడ్‌ జోన్‌పై 201 పరుగులు చేశాడు. 256 బంతులు ఆడిన అతడు 22 బౌండరీలు బాదాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనే అజేయంగా 94తో నిలిచాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.