శబరిమల: ఇక నిత్యం 5వేల మందికి దర్శనం!

తాజా వార్తలు

Updated : 21/12/2020 04:40 IST

శబరిమల: ఇక నిత్యం 5వేల మందికి దర్శనం!

తిరువనంతపురం: కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోన్న దృష్ట్యా శబరిమల వెళ్లే యాత్రికులు కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌(టీబీడీ) వెల్లడించింది. డిసెంబర్‌ 26తేదీ నుంచి వచ్చే భక్తులు కరోనా వైరస్‌ ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌లో వచ్చిన నెగటివ్‌ రిపోర్టును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 2 వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజు 3వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక వచ్చేవారం నుంచి రోజు 5వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమల క్షేత్రాన్ని దర్శించేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది.

మార్గదర్శకాల ప్రకారం, ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుని.. నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే శబరిమల దర్శనానికి అనుమతిస్తామని టీడీబీ అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు. అంతకుముందు కేవలం యాంటీజెన్‌ టెస్టులో పరీక్ష రిపోర్టు ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించారు. కానీ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 19 వరకు జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) పండుగ వేళ నెగటివ్‌ రిపోర్టు(RTPCR) లేని భక్తలను కొండపైకి అనుమతించమని టీబీడీ బోర్డు అధ్యక్షుడు స్పష్టంచేశారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే, శబరిమల ఆలయానికి కేరళ ప్రభుత్వం రూ.50కోట్లను అందించినట్లు టీడీబీ వెల్లడించింది.

ఇవీ చదవండి..

శబరిమల వెళ్తే..కరోనా పరీక్ష తప్పనిసరి

రెండో తీవ్రదశకు ఆస్కారం తక్కువే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని