శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీకున్‌ హీ కన్నుమూత
close

తాజా వార్తలు

Updated : 26/10/2020 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీకున్‌ హీ కన్నుమూత

దక్షిణ కొరియా: శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఛైర్మన్‌  లీ కున్‌-హీ (78) అనారోగ్యంతో కన్నుమూశారు. 2014 నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన గుండె శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారని శామ్‌సంగ్‌ వర్గాలు తెలిపాయి. కొరియాలోని డేగులో 1942 జనవరి 9న జన్మించిన లీ కున్‌-హీ శాంసంగ్‌ను ప్రపంచ దిగ్గజ సంస్థ మార్చారు. తన తండ్రి శామ్‌సంగ్‌ వ్యవస్థాపకుడు లీ బైంగ్‌-చుల్‌ మరణం తర్వాత 1987లో లీ కున్‌ శామ్‌సంగ్‌ బాధ్యతలు చేపట్టారు. స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్‌ చిప్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తయారు చేసే అగ్రగామి సంస్థగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ సంస్థ టర్నోవర్‌ దక్షిణ కొరియా జీడీపీలో ఐదోవంతు ఉంటుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని