అపాయింట్‌మెంట్‌ ఉంటేనే షాపింగ్‌!

తాజా వార్తలు

Published : 04/05/2020 17:46 IST

అపాయింట్‌మెంట్‌ ఉంటేనే షాపింగ్‌!

సోషల్‌ డిస్టెన్స్‌ నేపథ్యంలో మార్పులకు అవకాశం

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారితో వ్యాపార రంగంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకున్నాయి. ఐటీ పరిశ్రమలో దాదాపు 70-90% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా జరుగుతున్నాయి. భారత్‌లో సాంకేతికంగా ఇలాంటి మార్పులు రావాలంటే కనీసం 5-10 ఏళ్లు పడుతుందని అంతా భావించారు. ఇప్పుడది పటాపంచలై కేవలం వారాల వ్యవధిలోనే జరిగిపోయింది.

లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలు మినహా రిటైల్‌ దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో పరిమితం అనుమతులు ఇస్తోంది. వ్యాపారాలు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించింది. వైరస్‌కు ఇంకా సూదిమందు కనిపెట్టలేదు. అలాగని పూర్తిగా లాక్‌డౌన్‌నే కొనసాగించలేరు. భద్రతా మార్గదర్శకాలు ప్రకటించి మిగతా వ్యాపారాలను తెరిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల భద్రతా, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రిటైల్‌ స్టోర్లు ‘అపాయింట్‌మెంట్‌’ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నాయని తెలిసింది. సోషల్‌ డిస్టెన్స్‌ నేపథ్యంలో చాలా కంపెనీలో ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాయి.

‘ముందస్తు అపాయింట్‌మెంట్‌ తీసుకొనే కొనుగోళ్లు చేపట్టే రోజులు బహుశా సాకారం కాబోతున్నాయి’ అని ఫ్యాబ్‌ ఇండియా రిటైల్‌ అధ్యక్షుడు అజయ్‌ కపూర్‌ అంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు రిటైలర్లు ఆ దిశగా ఆలోచించక తప్పదని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిశాక తమ వినియోగదారుల చేత దుకాణాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటింపజేయడం అతిపెద్ద సవాలని ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని