close

తాజా వార్తలు

Published : 23/05/2020 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దరఖాస్తు చేసుకుంటే తరలిస్తాం:డీజీపీ

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఇప్పటివరకు రైళ్ల ద్వారా 1.22 లక్షల వలస కూలీలను వారి రాష్ట్రాలకు తరలించామని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్ తెలిపారు. ఈ రోజు 40రైళ్ల ద్వారా మరో 50 వేల మంది వలస కూలీలను తరలించినట్లు సీఎస్‌ చెప్పారు. బిహార్‌, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇవాళ బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలును సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి తరలించే వలస కూలీలకు రైల్వే శాఖ సమన్వయంతో ఆహారం, నీరు అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వలస కూలీల తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని సీఎస్‌ వివరించారు.

అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒకే రోజు 40 రైళ్ల ద్వారా 50 వేల మందికి పైగా కూలీలను తరలించినట్లు చెప్పారు. ఆపదనలో ఉన్న వాళ్లందరినీ సొంత రాష్ట్రాలకు పంపించడం సంతోషం కలిగించే విషయమన్నారు. ఇంకెవరైనా సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సౌకర్యం, భద్రత దృష్ట్యా వలస కూలీలను రైళ్లలోనే తరలిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి వివరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన