
తాజా వార్తలు
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను డిసెంబర్ 3వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేసన్లు, మ్యుటేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ కొనసాగుతోంది. గతంలో విచారించిన హైకోర్టు ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేపట్టవద్దని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. రేపు ఇదే విషయంపై వాదనలు కొనసాగించాలని కోరగా.. ఏజీ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ధరణికి సంబంధించిన కేసుల విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- 2-1 కాదు 2-0!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
