close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120017833 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => D39XFN9DbZQ [video_short_link] => D39XFN9DbZQ [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-02-06 19:12:02.247321 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘కియా’ అంత సులభంగా రాలేదు:చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసే స్థాయికి చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కియా మోటార్స్‌పై ‘రాయిటర్స్‌’లో కథనం వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడుతో కియా మోటార్స్‌ సంస్థ చర్చలు జరిపినట్లు ‘రాయిటర్స్‌’లో కథనం వచ్చిందన్నారు.  ఈ చర్చలు వాస్తవమేనని తమిళనాడు అధికారులు తెలిపారని చంద్రబాబు స్పష్టంచేశారు.  ఏపీలో పరిశ్రమలకు అనువైన వాతావరణం లేదని.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలు అందడం లేదని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొందని ఆయన వివరించారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్‌ అంత సులభంగా రాలేదని.. చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక ఆ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి నెలకొందన్నారు.

కియాకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వలేమని చెబుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇష్టారీతిన లెక్కలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేయడం వైకాపా నేతలకు అలవాటైందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.. పరిశ్రమలో ఉద్యోగాలు, పనులు తమ వాళ్లకే ఇవ్వాలని కియా ప్రతినిధులను వైకాపా నేతలు బెదిరించారని ఆరోపించారు. పెట్టుబడి రావడం చాలా కష్టమని.. దెబ్బతీయడం మాత్రం సులభమని వ్యాఖ్యానించారు. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. సీఎం చేసే పిచ్చి పనులు.. వాటిని సమర్థించే వ్యక్తుల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిందన్నారు. భవిష్యత్తులో బాగా పనిచేసినా ఎవరూ ఆసక్తి చూపరన్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.