close

తాజా వార్తలు

Published : 12/10/2020 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఆస్తి నమోదుకు కుస్తీ

రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గురించే చర్చోపచర్చలు సాగుతున్నాయి. నమోదు సాఫీగా సాగని చోట పరిష్కారాల కోసం ఇందులోని సమస్యలను, సంశయాలను పరస్పరం పంచుకుంటున్నారు. వ్యవసాయేతర ఆస్తులకు పాసుపుస్తకాలు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పక్షం రోజులకుపైగా ఈ ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టింది. పంచాయతీ, పురపాలక, నగరపాలక సిబ్బంది ఇల్లిల్లూ తిరుగుతూ ఆస్తుల లెక్కలు తీస్తున్నారు. ధరణి పోర్టల్‌లో టీఎస్‌ ఎన్‌పీబీ యాప్‌ ద్వారా నిక్షిప్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇప్పుడే అసలు సవాల్‌!

కొవిడ్‌పై ఆంక్షల సడలింపుతో క్రమేణా జనజీవన స్రవంతి గాడిలో పడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొద్దుపోయే దాకా వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచుతున్నారు. క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. జనం పూర్వం మాదిరిగా ఉద్యోగ, ఉపాధి వేటలో మునిగిపోతున్నారు. మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సిటీ బస్సులూ రోడ్డెక్కాయి. హోటళ్లు, రెస్టారెంట్లకు ఆమోదం లభించింది. త్వరలో సినిమా ప్రదర్శనలకూ, తదితర వినోదాలకూ కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొద్దిరోజుల్లోనే పండుగల సీజన్‌ ప్రారంభమవుతోంది. శీతాకాలం సమీపిస్తోంది. ఇప్పుడే అసలు సవాల్‌ మొదలైందని చెబుతున్నారు నిపుణులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

3. తెరవలేం

లాక్‌డౌన్‌తో మూతపడిన సినిమా హాళ్లను ఈ నెల 15 నుంచి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినా... రాష్ట్రంలో యాజమాన్యాలు సిద్ధంగా లేవు. థియేటర్లు తెరచినా ప్రదర్శించడానికి కొత్త సినిమాలేవీ లేకపోవడం వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య. కరోనాతో నిలిచిన సినిమా చిత్రీకరణలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమైనా తేదీలు ప్రకటించలేదు. దీపావళికిగానీ సినిమాహాళ్లు ప్రారంభించే పరిస్థితి లేదని 90% యాజమాన్యాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రుస్తుం-2 ప్రయోగం విజయవంతం

జాతీయ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) వంద శాతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత డ్రోన్‌ యుద్ధ విమానం రుస్తుం-2 ప్రయోగం విజయవంతమైనట్లు కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా డీఆర్‌డీఓ కేంద్రం అధికారులు తెలిపారు. దేశంలోని ఏకైక మానవ రహిత యుద్ధ విమానాల పరీక్ష కేంద్రంలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)లో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు టేకాఫ్‌ చేసింది. నిరంతరాయంగా 8 గంటల పాటు ఆకాశంలో 16 వేల అడుగుల ఎత్తులో సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో వాయుయానం చేసి మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్దేశిత ప్రదేశంలో దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ముప్పు ఎక్కువగా ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం

కొవిడ్‌-19 ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్‌ వినియోగంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఆయన ఆదివారం ‘సండే సంవాద్‌’ ద్వారా మాట్లాడుతూ కొవిడ్‌ అంశంపై దేశం నలుమూలల నుంచి ప్రజలు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తొలినాళ్లలో వ్యాక్సిన్‌ పరిమిత మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, ఆరోగ్యరీత్యా అధిక ముప్పు ఉన్న వారికి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువ ఉన్నవారికి, మరణం ముప్పు పొంచి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ అమ్మాయి బ్రిటన్‌ హై కమిషనర్‌!

ఆ అమ్మాయి వయసు 18 ఏళ్లే. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది. భారత్‌లో బ్రిటన్‌ హై కమిషనర్‌గా ఒకరోజు పనిచేసేందుకు ఆహ్వానం అందింది. ఒక్క రోజు సమయంలోనే హై కమిషనర్‌గా తన సామర్థ్యాన్ని చూపి ప్రశంసలు అందుకున్న ఆ అమ్మాయి దిల్లీకి చెందిన చైతన్య వెంకటేశ్వరన్‌. అక్టోబరు 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడంలో భాగంగా బ్రిటన్‌ హై కమిషనర్‌ కార్యాలయం ఆమెకు ఈ అవకాశాన్ని కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్వరలోనే పెళ్లి..  అంతలోనే మృత్యు ఒడికి

త్వరలోనే పెళ్లి.. ఇంట్లో మొదలైన హడావుడి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటున్న ఓ యువతి కలల సౌధాన్ని వర్షం రూపంలో వచ్చిన మృత్యువు కూల్చేసింది. ఈ ఘటనలోనే మరో మహిళ మృతి చెందడంతో పాటు మరో అయిదుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌ హుస్సేనీఆలం ఠాణా పరిధిలోని మూసాబౌలిలో చోటుచేసుకుంది. మూసాబౌలిలో సుమారు 80 ఏళ్ల నాటి జీ+1 భవనంలో హాజీ మహ్మద్‌ఖాన్‌(54) కుటుంబం నివాసముంటోంది. శిథిలావస్థకు చేరుకున్న భవనం జోరుగా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా నానింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముంచుకొస్తోంది.. ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అది పశ్చిమ వాయవ్యంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారి, రాత్రికి నరసాపురం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని ఆ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ఆదివారం సాయంత్రానికి గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతూ.. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 370 కి.మీ. దూరంలో, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భీమ్‌ - అల్లూరి కలుస్తారు.. కానీ!

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ నాయికలు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా అల్లుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో భీమ్‌ పాత్రను తారక్‌ పోషిస్తుండగా.. అల్లూరి పాత్రలో చరణ్‌ దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ లోగోతో తయారు చేసిన ఒక నాణెం లాంటి లుక్‌ను చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తె‘వాహ్‌’తియా

ఆశలు వదులుకున్న మ్యాచ్‌ను ఎలా గెలవాలో రాజస్థాన్‌ను చూసి నేర్చుకోవాలేమో! ఈ సీజన్లో ఇప్పటికే పంజాబ్‌పై అలాంటి సంచలన విజయం సాధించిన రాయల్స్‌...తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనా అలాగే నెగ్గింది. అప్పుడూ ఇప్పుడూ గెలుపులో రాహుల్‌ తెవాతియానే కీలకం కావడం విశేషం. 159 పరుగుల ఛేదనలో 78 పరుగులకే అయిదు ప్రధాన వికెట్లు పడిన స్థితిలో రియాన్‌ పరాగ్‌తో కలిసి అతను రాజస్థాన్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. దీంతో వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు గెలుపు రుచి చూడగా, ఏడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో ఓటమి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎదురులేని ముంబయి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.