ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి:ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి:ఎస్‌ఈసీ

కడప: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కడప కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్‌ హరికిరణ్‌ ఎస్‌ఈసీకి వివరించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లు తదితరాలను చెప్పారు. 

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ మాట్లాడుతూ ‘వైఎస్‌ హయాంలో ఆర్థిక కార్యదర్శిగా పని చేశా. దివంగత నేత వైఎస్ఆర్‌‌లో లౌకిక దృక్పథం ఉండేది. వైఎస్‌ఆర్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇటీవల జరిగిన పరిణామాల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశా. సరైన సమయంలో ఎన్నికల నిర్వహణ జరగడం రాజ్యాంగ హక్కు. దాని ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. వ్యవస్థలను గౌరవించకుండా మా వాళ్లు, మీ వాళ్లు అనడం సరికాదు. 2006లో 36 శాతమే ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత ఏకగ్రీవాలు తగ్గుముఖం పట్టాయి. బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం తగదు. వాటిని ప్రభావితం చేసే వారిపై షాడో టీమ్‌ల నిఘా ఉంటుంది. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం. ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవు. భిన్న సంస్కృతులకు తావులేదు. సమష్ఠిగా పని చేస్తాం. మీడియాను మించిన నిఘా మరొకటి లేదు. చురుకైన బాధ్యతను మీడియా తీసుకోవడం అభినందనీయం. బెదిరింపులకు పాల్పడే వారిపై షాడో టీమ్‌ల నిఘా ఉంటుంది. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఏకగ్రీవాలన్నీ తప్పని చెప్పట్లేదు. అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తాం’ అని అన్నారు.  

అంతకుముందు ఎస్ఈసీని తెదేపా నేతలు కలిశారు. గత పరిషత్‌ ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మరోసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఎస్‌ఈసీని కోరారు. నిన్న రాత్రి కడపకు చేరుకున్న ఎస్ఈసీ.. ఇవాళ ఉదయం ఒంటిమిట్ట కోదండరాముణ్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కడపకు వచ్చిన ఆయన కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్‌ తదితర జిల్లా అధికారులతో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత అంశాలపై సమీక్షించారు. 

ఇవీ చదవండి..
సజ్జలను తొలగించండి

మీరే గీత దాటారు
 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని