అరుణవర్ణమైన ఇంద్రకీలాద్రి
close

తాజా వార్తలు

Updated : 05/01/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరుణవర్ణమైన ఇంద్రకీలాద్రి

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి అరుణవర్ణమైంది. జగజ్జనని కనకదుర్గమ్మ దీక్ష చేపట్టిన భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమణ కోసం తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు భవానీ దీక్షల విరమణ కోసం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

మహామండపం ఎదురుగా నిర్మించిన హోమగుండాల్లో ఉదయం 6.50 గంటలకు ఆలయ వేదికపై కమిటీ ఆధ్వర్యంలో పండితులు అగ్నిప్రతిష్ఠాపన చేయడంతో భవానీదీక్ష విరమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్నిగుండాలతో పాటు ఇరుముడి సమర్పణకు 20 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేష్‌బాబు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాదశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుడి ఆలయం నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూ లైన్లలో భక్తులు ఎరుపురంగు వస్త్రాలతో తలపై ఇరుముడి పెట్టుకుని జై భవానీ నామస్మరణతో దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. రోజూ ఉదయం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీక్ష విరమణ కోసం వచ్చే భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. రోజుకు 10వేల మంది భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ను ముందస్తుగా బుక్‌ చేసుకున్న వారినే అనుమతిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా గిరి ప్రదక్షిణ, స్నానఘట్టాలలో స్నానాలు నిషేధించారు. ఆలయ పరిసరాల్లో కేశఖండనకు అవకాశం లేదు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు దర్శనం నిషేధించారు. క్యూలైన్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించడంతో పాటు.. మాస్కు ధరించాలని దేవస్థానం సూచిస్తోంది. దర్శనం అనంతరం కొండ దిగువన మహామండపం వద్ద ఇరుముడి, హోమగుండాలను ఏర్పాటు చేశారు. దీక్షల విరమణ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవానీ దీక్షా మహోత్సవాల సమయంలో సుమారు రెండు లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు.

ఇవీ చదవండి...
4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం

ఏపీలో భాజపా నేతల గృహనిర్బంధం
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని