దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలోకి నెడుతోంది: రాహుల్‌గాంధీ
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశ భద్రతను కేంద్రం ప్రమాదంలోకి నెడుతోంది: రాహుల్‌గాంధీ

దిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. గోగ్రా-హాట్‌స్ప్రింగ్‌, డెప్సాంగ్‌ నుంచి వెనుదిరిగేందుకు చైనా బలగాలు నిరాకరించాయన్న వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు ఆయన కేంద్రంపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. చైనాతో చర్చలు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు. హాట్‌స్ప్రింగ్‌‌, డెస్పాంగ్‌ ప్రాంతాల్లో చైనా ఆక్రమణల వల్ల దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందన్నారు. వ్యర్థమైన చర్చలతో జాతీయ భద్రత దెబ్బతిన్నదన్న రాహుల్‌ దేశానికి మెరుగైన నిర్ణయాలు అవసరమన్నారు. చైనాతో చర్చలు విఫలమవ్వడానికి కారణాలు తెలపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనాతో జరిపిన చర్చలు ఎందుకు ఫలించలేదో ప్రభుత్వం చెప్పాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ కూడా ఘాటుగా విమర్శించారు. చర్చల తర్వాత సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదని ఆయన  అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని