
తాజా వార్తలు
స్వాతంత్ర్యదినోత్సవం కన్నా గొప్పరోజు ఏదీ లేదు
సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు
ఇంటర్నెట్‌డెస్క్: 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మూడు రంగుల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, సుధీర్‌బాబు, జగపతిబాబు, రవితేజ, గోపీచంద్, మోహన్‌బాబు, గుణశేఖర్, కోన వెంకట్, అనిల్ రావిపూడి, నారా రోహిత్, సుశాంత్, శర్వానంద్, నాగశౌర్య, సురేందర్‌రెడ్డి, అడవి శేష్, బాబీ, రాఘవ లారెన్స్, అఖిల్ తదితరులు ట్వీట్లు చేశారు. సీసీటీలో జరిగిన వేడుకల్లో రామ్‌చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సైరా నరసింహారెడ్డి గెటప్ వేయగా, కుమార్తె అర్హ మదన్ మోహన్ మాలవీయ గెటప్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో అలరిస్తున్నాయి.
‘‘అందరికీ 74వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది పోరాడి ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అందించారు. అలాంటి వారి త్యాగాలను, ఆదర్శాలను నేడు స్మరించుకుందాం’’ -చిరంజీవి
‘‘స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ రోజుతో మనం ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాం. ఇది మన విజయం. ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మన సొంతదారిలో పయనించేలా చేశాయి. ఎప్పుడూ గర్వపడేలా ఉండండి. నా భారతీయ మిత్రులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్’’ -మహేశ్‌బాబు
‘‘74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’’ -ఎన్టీఆర్
‘‘ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు, కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న దేశంలోని యోధులకు నా వందనం. త్వరలోనే ఈ అడ్డంకులను అధిగమించి దేశం మరింత ముందుకు వెళ్లాలి’’-రామ్‌చరణ్
‘‘అప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన, ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్ కోసం పోరాడుతున్న సైనికులందరికీ ఇదే నా సెల్యూట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే’’-రవితేజ
‘‘స్వాతంత్ర్య దినోత్సవం కన్నా గొప్ప రోజు ఏదీ లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే’’-గోపీ చంద్