close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/04/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

‘కరోనా నియంత్రణకు చర్యలు కొనసాగిస్తాం’

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమీక్ష సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేస్తున్న కృషిని కొనసాగిస్తామని సీఎం ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యలను మరింత అంకితభావంతో కొనసాగిస్తామని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తామని సీఎం తెలిపారు. కరోనా బాధితులు కలిసిన ప్రతిఒక్కరినీ క్వారంటైన్‌ చేస్తున్నామని వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలో వైద్యారోగ్యశాఖ కృషి అమోఘమని సీఎం కొనియాడారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తోందన్నారు. సిబ్బంది భద్రతపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని సీఎం పేర్కొన్నారు. టెస్ట్‌ కిట్స్‌, పీపీఈలు, మాస్కులు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. సిబ్బంది రక్షణకు తగిన జాగ్రతలు తీసుకోవాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు వస్తున్న విరాళాలతో మాస్కులు, పీపీఈలు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రోగుల సంఖ్య పెరిగినా ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.

వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదు..

రాష్ట్రంలో వరికోతలు, ధాన్యం సేకరణపై అధికారులతో సీఎం సమీక్ష  నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా వ్యవసాయ పనులకు ఆటంకం కలుగరాదని ఈ  సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. వరికోతలు, ధాన్యం సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వరికోతలు, ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరగాలని సీఎం ఆదేశించారు. వరికోతలకు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితి గ్రామాల్లో కల్పించాలన్నారు. హర్వెస్టర్‌ పరికరాలు బిగించే మెకానిక్‌లకు పాసులిచ్చి అనుమతించాలని సూచించారు. స్పేర్‌ పార్ట్స్‌ అమ్మే దుకాణాలు తెరవడానికి అనుమతివ్వాలన్నారు. గ్రామస్తులు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలని సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే వాహనాలకు అనుమతిఇవ్వాలన్నారు. రైతులందరూ ఒకే సారి కొనుగోలు కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని ఆధికారులకు సూచించారు. కూపన్లలో తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు రైతులు రావాలని సీఎం పేర్కొన్నారు. కొనుగోలు
కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అన్నారు. 

ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన సీఎం 

గన్నీ బ్యాగుల కొరతపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉందని ప్రధానికి సీఎం వివరించారు. పశ్చిమబంగాలోని గన్నీబ్యాగుల తయారీ పరిశ్రమలు తెరిపించాలని సీఎం కోరారు. పరిశ్రమలు తెరిపిస్తే గన్నీ బ్యాగుల సమస్య కొలిక్కి వస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉందని, రాష్ట్రాలకు గన్నీ బ్యాగులు చేరవేయడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని కేసీఆర్‌ ప్రధానిని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌ అభ్యర్థనకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. గన్నీ బ్యాగులు చేరవేసే విషయంలో ఆయా శాఖలతో మాట్లాడతానని ప్రధాని హామీ ఇచ్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.