TS: జగిత్యాలలో కరోనా విజృంభణ
close

తాజా వార్తలు

Published : 17/04/2021 22:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: జగిత్యాలలో కరోనా విజృంభణ

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 928 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో చికిత్స పొందుతూ 9 మంది బాధితులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజా కేసుల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో 188 మంది, మెట్‌పల్లి పట్టణంలో 150, కోరుట్ల పట్టణంలో 109 మందికి వైరస్‌ సోకింది. గత మూడు రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గురువారం 746, శుక్రవారం 700 నమోదు కాగా.. శనివారానికి ఆ సంఖ్యలో భారీ మార్పు కనిపించింది. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్ర ఆస్పత్రి సహా మూడు సామాజిక ఆస్పత్రులు, 25 ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

బీర్కూర్‌లో 70 మందికి పాజిటివ్‌..
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం 234 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 70 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారి రవిరాజా, సీహెచ్వో రవీందర్ తెలిపారు. ఒక్క బీర్కూర్ గ్రామంలోనే 36 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని